మిస్డ్ కాల్ వచ్చిందని కొన్ని రకాల కోడ్లతో ఉండే నంబర్లకు తిరిగి కాల్ చేయొద్దని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే కేవలం మూడు సెకెన్లలో మీ ఫోన్ హ్యాక్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, కాంటాక్ట్స్, పాస్వర్డ్స్, వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరిస్తారు.+371 (5), +381 (2), +563 (2), +370 (225), +255 (2) ప్రమాదకర కోడ్లుగా గుర్తించుకోవాలని వివరించారు.ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90 లేదా #09 నంబర్లను డయల్ చేయమంటే చేయవద్దని, సహాయం కోసం 1930 నెంబరుకు కాల్ చేయాలని పోలీసులు కోరుతున్నారు.









