తిరుమల నడక మార్గంలో వెళ్ళే భక్తులకు టీటీడీ అధికారులు ఆంక్షలు సూచనలు చేస్తున్నారు.తిరుమల పరిధిలో చిరుతల సంచారం నేపథ్యంలో అధికారులు పటిష్ఠ భద్రతా చర్యల్లో భాగంగా నడక మార్గంలో పలు ఆంక్షలు విధించారు.
నడక మార్గన్న తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచన లు చేశారు.అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు యథావిధిగా అనుమతిస్తు న్నారు. అనంతరం గుంపులుగా వదులుతున్నారు.
ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తారు.12ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి నడక మార్గంలో అనుమతించడం లేదు.రాత్రి 9.30గం తరువాత నడక మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారు.