పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ ఏ. మురళీ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల,స్కిల్ హబ్ విద్యార్థిని విద్యార్థులతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేశారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో స్కిల్ హబ్ కోఆర్డినేటర్ ఎం రేవతి,స్కిల్ హబ్ ట్రైనర్ వి. వీరబాబు, పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
