ఏపీలో ప్రతి మూడో శనివారం మధ్యాహ్నం 1గం నుంచి 5గంవరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.ఈ సమావేశానికి ఉపాధ్యాయులందరూ హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటివరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం రోజు మొత్తం ఉండడంతో పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడేవి. ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఒక పూట నిర్వహించాలని నిర్ణయించింది.
