ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం నాటికి సాంకేతిక విద్యాపరంగా రాష్ట్రంలో మరో 20 కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకానున్నాయని జేఎన్టీయూ(కాకినాడ) ఉపకులపతి మురళీకృష్ణ తెలిపారు.ఇతర దేశాల్లో మాదిరిగానే మన రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో చిన్న చిన్న కళాశాలలను వర్సిటీలుగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోందన్నారు.ఇప్పటికే మూడు ఇంజినీరింగ్ కళాశాలలను విశ్వవిద్యాలయాలుగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
