పెద్దాపురం మండలం కట్టమూరులో రెవ డా పురుషోత్తం దాస్ లంక కల్వరి మిరాకల్ చర్చ్ లో ఉచిత కంటి వైద్య శిభిరాన్ని నిర్వహించారు.క్లాప్స్ సెక్రటరీ రెవ కె నాగ శ్రీనివాస్ (జిమ్స్ )అధ్యక్షతన జరిగిన శిభిరంలో కోశాధికారి ఎన్ సుకుమార్ తో పాటు ప్రతిభా పాఠశాల కరస్పాండంట్ ఎస్ వి వి ప్రకాష్ రిబ్బన్ కత్తిరించి శిభిరాన్ని ప్రారంభించారు.డాక్టర్ అమృత లాల్ వారి సిబ్బందితో విచ్చేసి బిపి, కంటి పరీక్షలు నిర్వహించారు. 120మందికి పరీక్షలు నిర్వహించగా 26 మందికి కళ్ల జోడ్లు అవసరమని,19 మంది ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జి సత్యానందం,ఉపాధ్యక్షులు ఎల్ జ్ఞానానందం,జి ఆనంద్ శామ్యూల్, సి హెచ్ అనీల్ కుమార్, మేరి రాజకుమారి,తదితరులు పాల్గొన్నారు.
