కొత్తపేట మండలం మోడేకూరులో వీరభద్రుని బోణం భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు.జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చింతపల్లి సత్తిపండు ఇంట జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు.స్వామివారిని పల్లకిపై ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులుచంటి,కృష్ణంరాజు, శ్రీనివాస్ చౌదరి,ఆదినారాయణ,శివాజీ నాయుడు, ఈశ్వరరావు,వెంకట ధనరాజ్,శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు,బాలాజీ,చందుతదితరులు పాల్గొన్నారు.
