ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ పెళ్లి కి ఉహించని అతిథి వచ్చింది.దీంతో వివాహ వేడుకకు వచ్చిన అందరూ భయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది.లక్నోలో ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుక జరుగుతోంది.ఉన్నట్టుండి అక్కడికి ఓ చిరుత రావడంతో వచ్చిన అతిథులందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టారు.పెళ్లి కుమారుడు,పెళ్లి కూతురు భయంతో కొన్ని గంటల పాటు కారులో దాక్కున్నారు. పోలీసులు,అటవీ అధికారులు వెంటనే ఘటానా స్థలానికి చేరుకుని చిరుతను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..
