Search
Close this search box.

  వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్..? మరోసారి అలాంటి సినిమా..?

విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరో గా మంచి పేరు తెచ్చుకున్నారు.. వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ మంచి పేరు ఉంది.. వెంకటేష్ గత సినిమా సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చి సూపర్ హిట్ అయింది.. ఈ సినిమాతో హీరో వెంకటేష్ ఫుల్ జోష్ మీదా ఉన్నారు..ఐతే వెంకటేష్ ఇప్పుడు ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారో అని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తాన్నారు… సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలై 3 నెలలు అవుతుందీ.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్ట్ ను వెంకటేష్ అనౌన్స్ చేయలేదు.. ఐతే ఇప్పుడు వెంకటేష్ తో ఓ బిగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ రూమర్ వైరల్ అవుతోంది.. టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదేంటంటే… ఫ్యామిలీ ఎమోషన్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌ అయిన హీరో వెంకటేశ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలసి ఓ సినిమా చేయనున్నారని టాక్. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

 

ఇదిలా ఉండగా, త్రివిక్రమ్ ఇప్పటికే అల్లు అర్జున్‌తో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. కానీ బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా బిజీగా ఉండటంతో, త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ను కొంత కాలం వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో వెంకటేశ్‌తో సినిమా కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

 

ఇది ఇద్దరి తొలి కాంబినేషన్ కావడం.., ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. త్రివిక్రమ్ మార్క్ ఎమోషన్, వెంకటేష్ ఫ్యామిలీ ఫీల్స్.. ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ, సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు