గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ల వారీగా జనసేన కోఆర్డినేటర్లను నియమించింది. పెద్దాపురానికి చెందిన కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామిని కాకినాడ పార్లమెంట్ కోఆర్డినేటర్గా నియమిస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కూటమి నేతలను సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించింది.
