ఇండియా టుడే ప్రతి ఆరు నెలలకు ఓసారి ప్రకటించే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఏపీ సీఎం చంద్రబాబు నాలుగో స్థానంలో నిలిచారు.గత ఏడాది ఆగస్టులో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు.ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా రాష్ట్రాన్ని గాడినా పెట్టడంతో పాటు పెన్షన్ల పెంపు,అన్న క్యాంటీన్లు, ఉచిత సిలిండర్ వంటి పథకాలు అమలు చేయడంతో చంద్రబాబు ఆరు నెలల్లో నాలుగో స్థానానికి చేరుకున్నారు.మొదటి స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తరువాత స్థానాల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నారు.ఇటీవల మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ఐదో స్థానంలో నిలిచారు.
