ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్లో 43 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. వాటిలో పేరాబత్తుల రాజశేఖరం (టీడీపీ),కాట్రు నాగబాబు(తెలుగు నవగర్జన),షేక్ హుస్సేన్(రిఫార్మ్ పార్టీ ఆఫి ఇండియా)మూడు నామినేషన్లు మినహా మిగిలిన 40 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.11 నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించారు.నేటితో ఉపసంహరణ కు గడువు ముగియనుంది. ఫిబ్రవరి 27న పోలింగ్.
