Search
Close this search box.

  ఇసుక ట్రాక్ట‌ర్లు సీజ్ చేసిన మైన్స్ అధికారులు

ఇసుక ట్రాక్ట‌ర్లు సీజ్ చేసిన మైన్స్ అధికారులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో 8 ట్రాక్ట‌ర్ల‌ను అధికారులు సీజ్ చేశారు. కేదార్లంక గ్రామం నుండి అనుమతులు లేకుండా గ‌త కొద్ది రోజులుగా ఇసుక‌ను భారీగా త‌ర‌లిస్తున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో ఇసుక త‌ర‌లింపుపై విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో గ‌నుల శాఖ ఆర్ ఐ సుజాత ఆధ్వ‌ర్యంలో ఇసుక త‌ర‌లిస్తున్న ట్రాక్ట‌ర్ల‌ను కొత్త‌పేట పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు