ఏపీ డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ పవిత్ర పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా తిరువనంతపురం సమీపంలోని ప్రఖ్యాత తిరువల్లం శ్రీ పరుశురామ క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటుగా కుమారుడు అఖీరా నందన్, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ ఆనంద్ సాయి ఉన్నారు. ఆలయ అర్చకులు, ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ సభ్యులు పవన్‌కు ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభ స్వాగతం పలికారు.
