పిఠాపురంలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై పోలీసులు దాడులు చేశారు. ఎఫ్ కెపాలెం గ్రామంలో కీర్తి సూరిబాబు ఇంట్లో 1.6 టన్నులు రేషన్ బియ్యా న్ని నిల్వ చేశాడు.బి. పత్తిపాడు గ్రామంలో రైస్ మిల్లు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సూరిబాబు,ధర్మరాజు,శివశంకర్,చిన్న బాబ్జిలు 14.4 టన్నుల రేషన్ బియ్యాన్ని లారీ,వ్యాన్లో తరలిస్తుండగా సీఐ జి.శ్రీనివాస్, ఎస్సై గుణశేఖర్ స్వాధీనం చేసుకున్నారు.నలుగురిపై కేసు నమోదు చేసి, వాహనాలు బియ్యాన్ని పిఠాపురం సీఐ కార్యాలయానికి తరలించారు.
