సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కృషితో రూ. 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుండి పోలీస్ స్టేషన్, వారపు సంత రహదారుల జంక్షన్ వరకు నిర్మాణ పనులను ప్రారంభించింది. పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు బలుసు వాసు, అడబాల కుమార స్వామి, బడుగు శ్రీకాంత్, ఇంజుమల్ల బాలకృష్ణ పర్యవేక్షించారు.
