సామర్లకోట మున్సిపాలిటీలో కుళాయిల్లో త్రాగునీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పట్టణ ప్రజలకు రక్షిత త్రాగునీరందించే ప్రధాన పైపు లైను పగిలింది. ప్రత్యమ్నాయ మార్గాలపై చర్యలు చేపట్టక పోవడంతో త్రాగునీరు, ఇతర అవసరాల కోసం నీరులేక పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు తక్షణం స్పందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.









