ఏపీ, తెలంగాణాలో వరద ప్రభావం వల్ల నష్టం వాటిల్లడంతో సినీ హీరోలు, రాజకీయ ప్రముఖులు ఎక్కడికక్కడ ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీకి కోటి ప్రకటించారు. ఇప్పటికే జూనియర్, నందమూరి బాలకృష్ణ, సినీ హీరో మహేష్ బాబులు రూ.50 లక్షల చొప్పన రెండు రాష్ట్రాలకు ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏపీకి రూ.కోటి ఇస్తామన్నారు. ఇక యువనటినటులు వారికి తోచిన విధంగా లక్ష నుండి రూ.10 లక్షల వరకూ సాయం అందిస్తున్నారు.
