విజయవాడలోని వరద ముంపులో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ 4 టన్నుల కూరగాయలను విజయవాడకు పంపించారు. అర్ధరాత్రి సైతం కష్టపడుతున్న చంద్రబాబును చూసి, నాయకులంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తన వంతు సహాయంగా పిఠాపురం టిడిపి తరపున కూరగాయలు పంపిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.









