విశాఖ జిల్లా మల్కాపురం శాంతి భద్రతల విభాగం సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న దేముడమ్మను ఎసిబి ట్రాప్ చేసి పట్టుకుంది. ఒక చీటింగ్ కేసులో 50 వేలు డిమాండ్ చేయగా, 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఈ మహిళ ఎస్సై పట్టుబడ్డారు. ఆమెని ఏసీబీ విచారిస్తోంది. ఇటీవల దేముడమ్మ నూతన గృహంలో ప్రవేశించారు. ఆమె వ్యవహార శైలి బాగోలేదని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.
