సెల్ ఫోన్ కి వచ్చిన లింకు క్లిక్ చేస్తే నగదు మాయమైన ఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరులో జరిగింది. పుచ్చ కాయల వెంకటరమణ సెల్ ఫోన్ కు మెసేజ్ రూపంలో ఓ లింకు వచ్చింది. వెంకటరమణ దానిపై క్లిక్ చేశాడు. సైబర్ నేరగాళ్లు అతనికి ఖాతాలో 2.62 లక్షల రూపాయల నగదును కాజేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో గండేపల్లి ఎస్సై శివ నాగబాబు కేసు నమోదు చేశారు.
