పెద్దాపురం నియోజకవర్గం ఉలిమేశ్వరంలో టిడిపి-వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఉలిమేశ్వరం టిడిపి నాయకుడు పేకేటి వెంకటేశ్వరరావుపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. ఈ సమయంలో దాడిని అడ్డుకోబోయిన వెంకటేశ్వరరావు తల్లికి గాయాలయ్యాయి. వీరిని పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. తనపై వైసీపీ కార్యకర్తలు విచక్షణా రహితంగా కర్రలతో దాడికి పాల్పడ్డారని పేకేటి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనపై పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప కూడా ఆరా తీశారు.
