రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. కాకినాడ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో 100కు పైగా అన్న క్యాంటీన్లను ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ లతోపాటు పిఠాపురం టిడిపి ఇన్చార్జ్ వర్మ ,జనసేన పిఠాపురం ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు.
