Search
Close this search box.

  పిఠాపురంలో ధర్మచక్రం షూటింగ్.. జూనియర్ చంద్రబాబు రాక

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, కూటమితో జత కట్టడానికి గల కారణాలను ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వంలో పడ్డబాధలను చెప్పేందుకు ధర్మ చక్రం పేరుతో రూపొందుతున్న చిత్రం షూటింగ్ పిఠాపురంలో జరుగుతుంది. పిఠాపురం టిడిపి కార్యాలయంలో జూనియర్ చంద్రబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయడం..వర్మ సీటు కోల్పోవడం వంటి కారణాలను ప్రధానంగా కూడా ఈ కథలో ప్రస్తావిస్తున్నారు. పిఠాపురం పరిస్థితి ప్రాంతాల్లో మరి కొద్ది రోజులు పాటు ఈ చిత్ర యూనిట్ సందడి చేయనుంది. పిఠాపురం వచ్చిన జూనియర్ చంద్రబాబుతో పలువురు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు