Search
Close this search box.

  ప‌ర్యావ‌ర‌ణంపై ప‌వ‌న్ ర‌ణం..ప‌నిత‌నం పిఠాపురం నుంచే..ఎందుకో తెలుసా..!

July 8, 2024 7:49 PM | Aditya369 News

ప‌ర్యావ‌ర‌ణంపై ప‌వ‌న్ ర‌ణం..ప‌నిత‌నం పిఠాపురం నుంచే..ఎందుకో తెలుసా..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచల‌నాల‌కు తెర తీస్తున్నారు. ఆయ‌న ఉప‌ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వి బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుండి రివ్యూలే. ఏక్క‌డా క్ష‌ణం తీరిక ఉండ‌టం లేదు. స‌మాజంలో మార్పు తీసుకురావాల‌న్న త‌పన ఆయ‌న‌లో ఉంది. మ‌నం చెప్ప‌డం కాదు..మ‌న‌మే చేసి చూపించాల‌న్న నినాదంతో మొద‌లైంది ప‌వ‌న్ ప్ర‌యాణం. అందుకే ఆయ‌న తీసుకున్న కీల‌క శాఖ‌ల‌పై ప‌ట్టు సాధిస్తున్నారు. అందులో ముఖ్యంగా ప‌ర్యావ‌ర‌ణం ఇప్పుడు ఆయ‌న‌కు ప్ర‌ధాన‌మైన‌శాఖ‌గా మారిపోయింది.

పవన్ కళ్యాణ్ చేపట్టిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలపై వరుసగా సమీక్షలు చేస్తూ ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలు, అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇస్తున్నారు.

ఇటీవ‌ల కాలంలో మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఆయ‌న‌ నివాసంలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పర్యావరణ ప్రేమికుడు విజయ రామ్ కలిశారు. పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన గోవింద భోగ్, రత్న చోడి, మాప్పిల్లై సాంబ తదితర బియ్యం రకాలను ప‌వ‌న్‌కు చూపించారు. అయితే ఇది ఎంత వ‌ర‌కూ అమ‌లు సాధ్య‌మ‌నే దానిపై ప‌వ‌న్ ఆరాతీస్తున్నారు.

తొలి ప్ర‌యోగం పిఠాపురం నుంచే..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పర్యావరణహితమైన వస్తువుల వాడకాన్ని మన వేడుకలు, ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుంది. వినాయక చవితి రాబోతుంది. ఈ వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుంది. జల కాలుష్యాన్ని అరికట్టవచ్చు. మట్టి గణపతికి పూజలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాము. దేవాలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్ తో చేసిన కవర్లలో అందిస్తున్నారు. బటర్ పేపర్ వినియోగాన్ని తగ్గించాలని పలువురు నిపుణులు సూచించారు. అలాంటి కవర్ల స్థానంలో చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడితే అవి వ్యర్థాల నిర్వహణ కూడా సులభం. వీటి వినియోగాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించ బోతున్నాము” అన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore