తిరుమలలో రూ.207.6 కోట్ల విలువైన 121 కేజీల బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు. శ్రీవారి కోసం 46 రకాల వేర్వేరు బంగారు ఆభరణాలను తయారు చేయించి కానుకగా అందించారు. జైన్ దంపతులు అందించిన బంగారు అభరణాలు ఈవిధంగా ఉన్నాయి.
• శ్రీవారి ఆభరణాలుగా 106 కిలోల బంగారం
• శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కేజీల బరువైన వస్త్రం

• బంగారు పాద కవచములు -3
• బంగారు అందెలు -3
• బంగారు పాకడాలు
• బంగారు తులసిపాత్ర హారం
• బంగారు అష్టోత్తర కాసుల మాల

• బంగారు చతుర్భుజ లక్ష్మీ హారం
• బంగారు పులిగోరు
• బంగారు అశ్వథ పాత్ర హారము
• బంగారు సాదా వడ్డాణము

• బంగారు గంటల మొలతాడు
• బంగారు సూర్యకటారి
• బంగారు కౌస్తుభం
• బంగారు శ్రీవత్సం
• బంగారు మోచేయి
• బంగారు కటి హస్తం

• బంగారు నాగాభరణ వడ్డాణము
• బంగారు గోపు
• బంగారు ఐదు పేటల కంఠీలు 5
• బంగారు చంద్రవంకీ కంఠీ
• బంగారు వైకుంఠ హస్తము
• బంగారు కటి హస్తము

• బంగారు నాగాభరణ కడియాలు 4
• బంగారు భుజ కీర్తులు 3
• బంగారు కర్ణపత్రములు 3
• బంగారు భావళీలు -3
• బంగారు సాలిగ్రామ హారములు- 3

• బంగారు కమలం తరహా సాలిగ్రామాలు 3
• బంగారు మోపుగల యజ్ఞోపవీతం
• బంగారు శంఖ కవచము
• బంగారు చక్ర కవచము

• బంగారు కిటీపు ముఖపట్టి
• బంగారు కిరీటము
• 2,427 కేరట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం
• 238.2 కేరట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు









