Search
Close this search box.

  ఉప్పాడ మ‌త్స్య‌కారుల గ‌ల్లంతుపై ప‌వ‌న్ ఆందోళ‌న‌

November 24, 2026 8:11 PM | Aditya369 News

ఉప్పాడ మ‌త్స్య‌కారుల గ‌ల్లంతుపై ప‌వ‌న్ ఆందోళ‌న‌

కాకినాడ జిల్లా, యు.కొత్తపల్లి మండల పరిధిలోని సుబ్బంపేటకు చెందిన మత్స్యకారులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, చేపడుతున్న గాలింపు చర్యలపై కాకినాడ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ నెల 4వ తేదీన కాకినాడ నుంచి బయలుదేరి వేటకు వెళ్లారనీ, 10వ తేదీ విశాఖ హార్బర్ కు చేరుకుని తమ వద్ద ఉన్న చేపలు విక్రయించి, 10వ తేదీ తిరిగి సముద్రంలోకి వెళ్లినట్టు కలెక్టర్ ప‌వ‌న్‌కు తెలిపారు. 14వ తేదీ వరకు ఫోన్‌లో తమ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉన్నారని, ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని కలెక్టర్ వివరించారు. అయితే ఈ నెల 18వ తేదీ వరకు మత్స్యకారులు వెళ్లిన బోటు పారాదీప్ పోర్టు సమీపంలో కనిపించిందని, ఆ తర్వాత కనబడకుండా పోయిందని విచారణలో తేలింది. సమాచారం అందిన వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించామని, వెంటనే కాకినాడ, చెన్నై, ఒడిశా కోస్టు గార్డు అధికారులను సంప్రదించి, గాలింపు చేపట్టినట్టు కలెక్టర్ తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు