Search
Close this search box.

  ఓటీటీలోకి మెగాస్టార్ ఎంట్రీ.. ‘మెగావర్స్‌’ టాక్‌షోకు హోస్ట్‌గా చిరంజీవి!

November 24, 2026 2:40 PM | Aditya369 News

ఓటీటీలోకి మెగాస్టార్ ఎంట్రీ.. ‘మెగావర్స్‌’ టాక్‌షోకు హోస్ట్‌గా చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా ఓటీటీ వేదికపై హోస్ట్‌గా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న సెలబ్రిటీ టాక్‌షో ‘మెగావర్స్‌’కు ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక నిమిషం నాలుగు సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమో ఆటో ఎంట్రీతో ప్రారంభమవుతుంది. చిరంజీవి పేరును ఇంగ్లిష్‌లో రాసే విధానంలో ‘Chiranjeevi’ అనే పదంలోని ‘N’ అక్షరం కనిపించకపోవడాన్ని వినూత్నంగా చూపించారు. ఆ అక్షరం నెట్‌ఫ్లిక్స్ తరఫున వచ్చి చేరిందనే భావన కలిగించేలా వీడియోను రూపొందించారు. ‘అదేంటి.. చిరు పేరులో N లేదు’ అంటూ సాగే పాట ప్రోమోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చివర్లో చిరంజీవి పేరులోని ‘N’ అక్షరాన్ని నెట్‌ఫ్లిక్స్ సింబల్‌తో చూపించడం ఆకట్టుకుంటోంది. అనంతరం చిరంజీవి ‘ఇది నా అడ్డా’ అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో అలరించారు. మెగా నవ్వులు, ముచ్చట్లు ఒకే వేదికపై చూడబోతున్నారని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. దీంతో ఈ టాక్‌షో ఎప్పుడు ప్రారంభమవుతుందా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు