Search
Close this search box.

  దొంగ నా కొడుకు మూవీ రివ్యూ.. మౌళి నవ్వించాడా..?

November 13, 2026 10:10 PM | Aditya369 News

దొంగ నా కొడుకు మూవీ రివ్యూ.. మౌళి నవ్వించాడా..?

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే పరిణామాలు, వాటి చుట్టూ జరిగే కామెడీ, క్రైమ్ అంశాలతో తెరకెక్కిన సినిమా ‘దొంగ నా కొడుకు’. మౌళి హీరోగా నటించిన ఈ చిత్రంలో సుస్మిత శెట్టి హీరోయిన్‌గా కనిపించింది. అలీ, రఘుబాబు, బబ్లూ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించింది? కథనం ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకుందాం.

కథ విషయానికి వస్తే..

ఈశ్వర్ (మౌళి) ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై, ఆ వ్యసనం కారణంగా కుటుంబ సభ్యులను సైతం ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. బెట్టింగ్‌లలో డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు, లోన్ యాప్స్ ద్వారా అప్పులు చేస్తూ మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. ఈ క్రమంలో అతడికి దీపు (సుస్మిత శెట్టి) పరిచయమవుతుంది. ఆమె దగ్గర కూడా డబ్బులు తీసుకున్న ఈశ్వర్, చివరకు ఆమె బంగారు ఉంగరాలను సైతం తాకట్టు పెడతాడు.

అయితే ఈ విషయం తెలిసిన దీపు తండ్రి (రఘుబాబు) నేరుగా ఈశ్వర్ ఇంటికి వచ్చి నిలదీయడంతో అతడికి కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అనుకోకుండా ఓ బంగారు దుకాణంలో జరిగిన దొంగతనం కేసులో చిక్కుకుంటాడు. మరి ఈశ్వర్ ఆ రాబరీ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు? పోలీసులకు దొరికాడా? అతడి వ్యవహారాల వల్ల తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ క్రైమ్ కామెడీ నేపథ్యం. బంగారు దుకాణంలో జరిగే దొంగతనం చుట్టూ దర్శకుడు కామెడీతో పాటు కొన్ని ఆసక్తికరమైన థ్రిల్లింగ్ అంశాలను జోడించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, ఫస్టాఫ్‌లో వచ్చే వినోదాత్మక సన్నివేశాలు, సెకండాఫ్‌లోని కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

హీరో మౌళి ఈశ్వర్ పాత్రలో చక్కగా నటించాడు. బెట్టింగ్‌లకు అలవాటుపడి, సమస్యల్లో చిక్కుకునే సగటు యువకుడిగా తన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా క్రైమ్ సన్నివేశాల్లో ఇరుక్కునే సందర్భాల్లో అతడి నటన సహజంగా అనిపిస్తుంది.

హీరో తండ్రి పాత్రలో అలీ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. రఘుబాబు, బబ్లూ కూడా తమ పాత్రలతో నవ్వులు పంచారు. హీరోయిన్ సుస్మిత శెట్టి తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించింది. తల్లి పాత్రలో రజిత, ప్రియా, గుండు సుదర్శన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా కథకు తగ్గట్టుగా నటించారు.

దర్శకుడు శ్రీను కంబాల తన టేకింగ్‌తో సినిమాను వినోదాత్మకంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రధాన పాత్రల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు బాగానే వర్కౌట్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్:

సినిమాలో కామెడీ, సస్పెన్స్, కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ కథనం మాత్రం అన్ని చోట్లా ఒకే స్థాయిలో ఆసక్తిని కొనసాగించలేకపోయింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కనిపించిన వినోదం సెకండాఫ్‌లో కొంత తగ్గుతుంది. ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడంతో ప్రేక్షకులకు అక్కడక్కడా బోర్ కొట్టే అవకాశం ఉంది.

అలాగే కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువగా అనిపిస్తుంది. పాత్రల మధ్య జరిగే రాబరీ ప్లానింగ్, దొంగతనం వెనుక ఉన్న పరిణామాలను మరింత ఆసక్తికరంగా చూపించాల్సింది. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే సినిమా మరింత మెరుగ్గా ఉండేది.

టేకింగ్ బాగున్నప్పటికీ కథలో కొత్తదనం లేకపోవడం, కొన్ని సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా ఉండటం కూడా సినిమాకు మైనస్‌గా నిలుస్తాయి. క్రైమ్ కామెడీగా మంచి అవకాశమున్న కథను మరింత బలమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ మంచి బలంగా నిలిచింది. కెమెరామెన్ సూర్య బాలాజీ అందించిన విజువల్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కామెడీ, కీలకమైన క్రైమ్ సన్నివేశాలను చక్కగా తెరకెక్కించారు.

సింజిత్ యర్రమిల్లి అందించిన నేపథ్య సంగీతం కథనానికి తగ్గట్టుగా ఉంది. కొన్ని సన్నివేశాల్లో బీజీఎం మంచి ఫీల్‌ను అందిస్తుంది. ఎడిటర్ శ్రీధర్ సోంపల్లి తన పనితనంతో సినిమాను పర్వాలేదనిపించేలా మలిచారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా సినిమా ఎలా ఉందంటే..

మొత్తంగా ‘దొంగ నా కొడుకు’ ఒక సాధారణ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్. మౌళి నటన, అలీ కామెడీ, రఘుబాబు, బబ్లూ వినోదం, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. అయితే కథనంలో వేగం తగ్గడం, సెకండాఫ్‌లో కామెడీ ఆశించిన స్థాయిలో లేకపోవడం, కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు నిరాశపరుస్తాయి. కామెడీ కోసం కొన్ని సన్నివేశాలు నవ్వించినప్పటికీ, బలమైన కథనం లేకపోవడం సినిమాకు ప్రధాన బలహీనత. ఓవరాల్‌గా భారీ అంచనాలు లేకుండా చూస్తే ఒకసారి ప్రయత్నించదగిన క్రైమ్ కామెడీ మూవీ.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు