Search
Close this search box.

  శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ మ్యాచ్ చేయడం కష్టమే: సాక్షి మడోల్కర్

November 24, 2026 2:38 PM | Aditya369 News

శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ మ్యాచ్ చేయడం కష్టమే: సాక్షి మడోల్కర్

యంగ్ హీరోయిన్ సాక్షి మడోల్కర్ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో 2025లో విడుదలైన ‘మోగ్లీ’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె.. ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘ఫ్యామిలీ ప్యాక్’ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో ‘ఫ్యామిలీ ప్యాక్’ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో సాక్షి మడోల్కర్ తన షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా శ్రీవిష్ణు కామెడీ టైమింగ్‌ను అందుకోవడం చాలా కష్టమని ఆమె తెలిపారు. ఆయన కామెడీ టైమింగ్ మరో స్థాయిలో ఉంటుందని, ఆయనతో కలిసి నటించడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.

కామెడీ సినిమా చేయడం తనకు ఇదే మొదటిసారి అని సాక్షి వెల్లడించారు. చిత్ర బృందంలోని మిగతా సభ్యులంతా గతంలో కలిసి పనిచేశారని, తాను మాత్రమే కొత్త సభ్యురాలిగా వచ్చానని తెలిపారు. అయినప్పటికీ అందరూ ఎంతో సహకరించారని, షూటింగ్ సరదాగా సాగిందని చెప్పారు. తన పాత్రకు న్యాయం చేయాలనే బాధ్యత, ఒత్తిడి ఉన్నప్పటికీ దర్శకుడు, నిర్మాతలు ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు