పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉండగా.. తాజాగా ప్రభాస్ పాత్రకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘స్పిరిట్’లో ప్రభాస్ పాత్రలో గ్రే షేడ్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. నెగిటివ్‌గా కనిపించే పరిస్థితుల్లో కూడా అతని పాత్రలో ఓ పాజిటివ్ యాంగిల్‌ను చూపించనున్నారని టాక్. అంతేకాదు, ఫస్ట్ హాఫ్‌లో ప్రభాస్ లుక్‌కు, సెకండాఫ్‌లో కనిపించే లుక్‌కు భారీ వేరియేషన్ ఉంటుందని సమాచారం.
ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఉండబోతున్నాయని మేకర్స్ ఇప్పటికే చెబుతున్నారు. అయితే ఈ సినిమా సాధారణ పోలీస్ యాక్షన్ డ్రామాలా కాకుండా.. ఓ వైల్డ్ నేచర్ ఉన్న మాజీ పోలీస్ జీవితంలో జరిగే పతనం, ఆ తర్వాత అతను తిరిగి నిలబడేందుకు చేసే పోరాటం చుట్టూ కథ సాగుతుందని తెలుస్తోంది.
అంటే ‘పోలీస్ వర్సెస్ క్రిమినల్స్’ అనే సాధారణ కాన్సెప్ట్‌కు భిన్నంగా.. తనను తాను కోల్పోయిన ఓ వ్యక్తి మళ్లీ ఎలా తన జీవితాన్ని నిలబెట్టుకున్నాడు అనే క్యారెక్టర్ డ్రామాను సందీప్ రెడ్డి వంగా తన స్టైల్‌లో చూపించబోతున్నారని టాక్.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా త్రుప్తి దిమ్రి నటిస్తోంది. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
మొత్తానికి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, పవర్‌ఫుల్ యాక్షన్, సందీప్ రెడ్డి వంగా టేకింగ్‌తో ‘స్పిరిట్’ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









