Search
Close this search box.

  విజయ్–రాజశేఖర్ కాంబోలో సరికొత్త ట్రీట్.. రౌడీ జనార్దనపై భారీ హైప్..!

October 5, 2026 9:51 PM | Aditya369 News

విజయ్–రాజశేఖర్ కాంబోలో సరికొత్త ట్రీట్.. రౌడీ జనార్దనపై భారీ హైప్..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. తాజాగా విజయ్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడట. రెగ్యులర్ మాస్ హీరో ఇమేజ్‌కు భిన్నంగా.. బలమైన భావోద్వేగాలు ఉన్న పాత్రలో విజయ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా సినిమాలో ఫాదర్–సన్ ఎమోషన్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. సెకండాఫ్‌లో యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంటాయట. అంతేకాదు, విజయ్ పాత్రకు సంబంధించిన ఓ కీలకమైన ఫ్లాష్‌బ్యాక్‌ను కూడా సెకండాఫ్‌లో ప్లాన్ చేశారని టాక్.

ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో విజయ్ పాత్ర చుట్టూ ఫుల్ యాక్షన్ డ్రామా ఉండబోతుందట. ముఖ్యంగా విజయ్ దేవరకొండ చేసే యాక్షన్ సీక్వెన్సులు సినిమా మొత్తానికి ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం.

ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రతో పాటు లుక్ కూడా ఇప్పటివరకు చూడని విధంగా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని టాక్.

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ ఉంది.

మరి ఫాదర్–సన్ ఎమోషన్, పవర్‌ఫుల్ యాక్షన్, డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో వస్తున్న ‘రౌడీ జనార్దన’ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore