Search
Close this search box.

  గురూజీకి సెకండాఫ్ నచ్చలేదా..? ‘ఆదర్శ కుటుంబం’కు రీషూట్..!

October 5, 2026 9:42 PM | Aditya369 News

గురూజీకి సెకండాఫ్ నచ్చలేదా..? ‘ఆదర్శ కుటుంబం’కు రీషూట్..!

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే మరోసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్, అదిరిపోయే పంచులతో సినిమా ఉండబోతుందని మూవీ లవర్స్ ఫిక్స్ అయిపోయారు.

ముందుగా ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత రిలీజ్ డేట్‌ను అక్టోబర్ 9కి మార్చినట్లు అధికారికంగా తెలిపారు. ఇప్పుడు తాజాగా ఈ డేట్ కూడా మారే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న సమాచారం ప్రకారం, అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 14కి వాయిదా పడే ఛాన్స్ ఉందట. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక సినిమా ఆలస్యానికి మరో కారణం కూడా వినిపిస్తోంది. సినిమా ఫైనల్ కట్ చూసిన త్రివిక్రమ్‌కు ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో పూర్తి సంతృప్తి కలగలేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ, సెకండాఫ్‌లో మరింత ఎమోషన్, బలమైన క్లైమాక్స్ ఉంటే సినిమా ఇంకో స్థాయికి వెళ్తుందని త్రివిక్రమ్ భావిస్తున్నారట.

అందుకే కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసి, సెకండాఫ్‌ను మరింత బలంగా తీర్చిదిద్దాలని టీమ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు సెకండాఫ్, క్లైమాక్స్ ఎంత కీలకమో తెలిసిందే.

అయితే ఇవన్నీ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్స్ మాత్రమే. నిజంగానే అక్టోబర్ 9 మిస్ అవుతుందా? అక్టోబర్ 14న సినిమా థియేటర్లలోకి వస్తుందా? లేక రీషూట్ కారణంగా మరోసారి వాయిదా పడుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరి ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore