నేచురల్ స్టార్ నాని.. హీరోగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో, వ్యక్తిగా కూడా అంతే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయనతో కలిసి పనిచేసిన చాలామంది నటీనటులు నాని వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో బాలీవుడ్ నటుడు, డ్యాన్సర్ రాఘవ్ జుయల్ కూడా చేరిపోయారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో రాఘవ్ జుయల్ కీలకమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. ఈ సినిమా అనుభవం నేపథ్యంలో నానితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ రాఘవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
తన జీవితంలో నాని ఒక ‘సేఫ్ ప్లేస్’ లాంటి వ్యక్తి అంటూ రాఘవ్ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న సమయంలో నాని తనకు అండగా నిలిచారని తెలిపారు. సినిమా, కెరీర్, జీవితం గురించి తనతో గంటల తరబడి మాట్లాడేవారని.. తాను ఎమోషనల్‌గా ఉన్నా, కన్ఫ్యూజ్ అయినా ఎప్పుడూ చిన్నచూపు చూడలేదని రాఘవ్ పేర్కొన్నారు.
నానితో మాట్లాడిన ప్రతిసారీ తన మనసులోని భారం తగ్గిపోయేదని ఆయన చెప్పారు. చాలామంది సలహాలు మాత్రమే ఇస్తారని.. కానీ నాని మాత్రం తన పరిస్థితిని అర్థం చేసుకుని సరైన దృక్పథాన్ని చూపించారని ప్రశంసించారు.
ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలి? వ్యక్తిగా ఎలా ఎదగాలి? అనే విషయాల్లో నాని తనకు ఎన్నో విషయాలు నేర్పించారని రాఘవ్ తెలిపారు. ముఖ్యంగా ఎవరూ చూడనప్పుడు కూడా నాని చూపించే నిజాయతీ, దయ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు.
కొందరు మన కెరీర్‌కు మార్గదర్శకంగా నిలుస్తారు.. మరికొందరు మనకు మానసిక బలాన్ని ఇస్తారు. కానీ నాని తనకు ఈ రెండింటినీ ఇచ్చారని రాఘవ్ చెప్పుకొచ్చారు. చివర్లో ‘ఐ లవ్ యూ నాని దాదా’ అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాఘవ్ జుయల్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ సమయంలో నాని, రాఘవ్ మధ్య ఎంత మంచి బాండింగ్ ఏర్పడిందో ఈ పోస్ట్ చూస్తే అర్థమవుతోంది.









