మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాకా’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు కొల్లి బాబీతో చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌పై భారీ క్రేజ్ నెలకొంది.
ఇక ఈ సినిమాలో చిరంజీవి లుక్స్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నాయనే టాక్ మొదటి నుంచే ఉంది. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో సింపుల్ లుక్‌లో కనిపించిన మెగాస్టార్.. సినిమాలో మరిన్ని డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ స్వగృహానికి చిరంజీవి వెళ్లిన సమయంలో కనిపించిన ఆయన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యాప్ పెట్టుకుని, రఫ్ లుక్‌తో పాటు చిన్నగా మెలితిప్పిన మీసంతో మెగాస్టార్ కనిపించడంతో.. ఇది ‘కాకా’ సినిమాలోని మరో లుక్కేనా అనే చర్చ మొదలైంది.
దీంతో దర్శకుడు బాబీ సినిమాలో ఇంకెన్ని సర్ప్రైజ్లు ప్లాన్ చేశారనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.
మరోవైపు ‘కాకా’ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి మెగాస్టార్ డిఫరెంట్ లుక్స్‌తో పాటు బాబీ ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారో చూడాలి.









