బాక్సాఫీస్ దగ్గర ‘టాక్సిక్’ ఆశించిన స్థాయిలో మెప్పించకపోయినా.. రాకింగ్ స్టార్ యష్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్న యష్.. తనకున్న పాన్-ఇండియా మార్కెట్ ఏంటో ‘టాక్సిక్’ ఓపెనింగ్స్‌తో మరోసారి చూపించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. యష్ సినిమాకు మొదటి రోజే భారీ స్థాయిలో ప్రేక్షకులు రావడం అతని స్టార్ పవర్‌ను స్పష్టంగా చూపిస్తోంది.
అయితే యష్ స్థాయికి తగ్గట్టుగా సరైన కథ, పవర్ఫుల్ క్యారెక్టర్ పడితే.. బాక్సాఫీస్ దగ్గర అతని రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో యష్‌కు సరైన కథను డీల్ చేయగల దర్శకుడిగా ప్రశాంత్ నీల్ పేరు మరోసారి తెరపైకి వస్తోంది. ‘కేజీఎఫ్’తో యష్‌ను నేషనల్ స్టార్‌గా మార్చిన ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అందుకే ‘కేజీఎఫ్ 3’ కోసం ప్రశాంత్ నీల్ తన ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి చేసే వరకు యష్ వేచి చూసినా.. ఈ ఇద్దరూ మరోసారి కలిస్తే బాక్సాఫీస్ దగ్గర భారీ సంచలనం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
మరి ‘కేజీఎఫ్ 3’ ఎప్పుడు మొదలవుతుంది? యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఒక్కటి మాత్రం క్లియర్.. యష్‌కు సరైన కథ పడితే.. బాక్సాఫీస్‌ను షేక్ చేసే సత్తా ఇంకా అలాగే ఉంది!









