ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. గత ఏడాదే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా దాదాపు పూర్తయిందనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు మూవీకి సంబంధించిన అధికారిక అప్డేట్స్ మాత్రం పెద్దగా బయటకు రాలేదు.
అయితే షూటింగ్‌కు సంబంధించిన విషయాలతో పాటు సినిమా కథ, క్యారెక్టర్స్, రిలీజ్ డేట్‌పై రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినిమా విడుదల తేదీపై తాజాగా మరో ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది.
2028లోనే ‘రాకా’?
ఇప్పటివరకు ‘రాకా’ సినిమాను 2027 డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో రిలీజ్ డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా 2027లో కాకుండా 2028 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
జనవరి 26న సినిమాను విడుదల చేస్తే రిపబ్లిక్ డే వీకెండ్‌ను కూడా క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుందని టాక్. అయితే ఈ రిలీజ్ డేట్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంగానే చూడాలి.
తండ్రి, కొడుకులుగా అల్లు అర్జున్?
ఇక ‘రాకా’ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త కూడా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్. అందులో తండ్రి, ఇద్దరు కొడుకుల పాత్రలను ఆయనే పోషించనున్నారని సమాచారం. అంతేకాదు.. ఒక కొడుకు పాత్రలో అల్లు అర్జున్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
అయితే ఈ క్యారెక్టర్లకు సంబంధించిన విషయాలపై కూడా మేకర్స్ అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
దీపిక, రష్మిక కీలక పాత్రల్లో?
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరోవైపు రష్మిక మందన్న కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం ఉంది. అయితే ఆమె పాత్ర నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుందనే వార్తలకు కూడా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో వీఎఫ్‌ఎక్స్ వర్క్ అవసరమవుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తయినా.. పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా విడుదలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
మరి ‘రాకా’ నిజంగానే 2028 జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అల్లు అర్జున్ మూడు పాత్రల్లో కనిపించనున్నారనే వార్త ఎంతవరకు నిజం? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
ఇక ‘రాకా’ తర్వాత అల్లు అర్జున్ మరో క్రేజీ కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.







