మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన రీరికార్డింగ్ పనుల్లో కీలక పురోగతి సాధించినట్లు సమాచారం.
మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి సినిమాకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని కీలక ఎపిసోడ్లకు అందించిన ఆర్‌ఆర్ సినిమాకు మరింత బలాన్ని తీసుకొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్లలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
భారీ బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ‘విశ్వంభర’లో విజువల్స్‌తో పాటు మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించనుంది. రీరికార్డింగ్ పూర్తైన తర్వాత ఫైనల్ అవుట్‌పుట్‌ను పరిశీలించిన మేకర్స్ సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు సినిమా రిలీజ్ డేట్‌పై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓటీటీ రైట్స్ డీల్ పూర్తయిన తర్వాత థియేట్రికల్ రిలీజ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై చిరంజీవి అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరి మిగిలిన కార్యక్రమాలు పూర్తయ్యాక ‘విశ్వంభర’ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.







