నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం NBK 111. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. షూటింగ్ సమయంలో బాలకృష్ణ కాలికి గాయం కావడంతో ఇటీవల ఆయనకు సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్‌కు కొంత విరామం ఇచ్చారు. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం నిలకడగా ఉండటంతో త్వరలోనే ఆయన తిరిగి షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారనే విషయంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ చిత్రబృందం తాజాగా అధికారిక ప్రకటన చేసింది.
వృద్ధి సినిమాస్ బ్యానర్ తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది. “రేపు ఈ మ్యాడ్‌నెస్‌కు ఒక పేరు పెట్టబోతున్నాం.. అలాగే సినిమా రాకకు సంబంధించిన తేదీని కూడా ప్రకటించబోతున్నాం” అంటూ ప్రకటించింది. సాయంత్రం 6:40 గంటలకు టైటిల్‌తో పాటు విడుదల తేదీని వెల్లడించనున్నట్లు తెలిపింది.
ఈ పోస్టర్లో బాలకృష్ణ ముఖంపై రక్తపు మరకలతో కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్‌ను బట్టి చూస్తే ఈ చిత్రం పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.
NBK 111 కోసం ఇప్పటికే ‘గాడ్’, ‘దాదా’ వంటి పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ‘దాదా’ టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజమెంత అనేది రేపు సాయంత్రం అధికారిక ప్రకటనతో తేలిపోనుంది.
టైటిల్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్న నేపథ్యంలో బాలయ్య అభిమానుల్లో మరింత ఉత్కంఠ నెలకొంది.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మరోసారి ఈ కాంబినేషన్లో వస్తున్న NBK 111పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రేపటి అధికారిక ప్రకటనతో ఈ విషయంలోనూ పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న మరో సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.








