Search
Close this search box.

  RC17 పై బిగ్ అప్డేట్..! దసరాకు గ్రాండ్‌గా లాంచ్..?

September 3, 2026 6:55 PM | Aditya369 News

RC17 పై బిగ్ అప్డేట్..! దసరాకు గ్రాండ్‌గా లాంచ్..?

‘రంగస్థలం’.. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. అప్పటివరకు స్టైలిష్, యాక్షన్ హీరోగా కనిపించిన రామ్ చరణ్.. ఈ సినిమాతో పక్కా పల్లెటూరి యువకుడిగా, వినికిడి లోపం ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

కమర్షియల్‌గా భారీ విజయం సాధించడంతో పాటు ఈ సినిమా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. దీంతో సుకుమార్, చరణ్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరి కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దసరాకు గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు?
ఇప్పటికే సుకుమార్, చరణ్ కాంబినేషన్‌లో మరో సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదేంటంటే.. వచ్చే దసరాకు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించనున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హీరోయిన్ విషయంలో మరోసారి ట్విస్ట్!
ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో కూడా ఇప్పటికే ఎన్నో రూమర్స్ వినిపించాయి. మొదట కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ‘దురంధర్’ బ్యూటీ సారా అర్జున్ నటించబోతున్నారనే ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ‘రంగస్థలం’లో చరణ్‌తో కలిసి నటించిన సమంతనే మరోసారి హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో సందడి చేసిన నయనతార కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ వార్తల్లో ఏది నిజం? ఎవరు సినిమాలోకి వస్తారు? ఎవరు తప్పుకుంటారు? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే.
చరణ్‌తో సుక్కు ఏం చేయబోతున్నాడు?
ఇక సుకుమార్ విషయానికొస్తే.. అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ‘పుష్ప 2’ భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు చరణ్‌తో మరోసారి చేతులు కలపడంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

మరి ‘రంగస్థలం’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సుకుమార్, చరణ్ కలిసి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు? ఈసారి కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా? అనేది చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు