మన టాలీవుడ్ ఎవర్గ్రీన్ మన్మథుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కింగ్ నాగార్జున కెరీర్లో ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, చాలా ఫ్రెష్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉండబోతుందనే ఆసక్తిని గ్లింప్స్ కలిగిస్తోంది.
‘మనుషులు రెండు రకాలు.. డబ్బున్నోళ్లు, డబ్బులేనోళ్లు’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. డబ్బు చుట్టూ తిరిగే ఓ ఆటలో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కార్తీక్ ఈ కథను చాలా స్టైలిష్‌గా ప్రజెంట్ చేసినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
రిచ్ విజువల్స్, స్టైలిష్ టేకింగ్‌తో పాటు నాగార్జున లుక్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. తనకు మాత్రమే సొంతమైన హ్యాండ్సమ్ లుక్‌లో కనిపించిన కింగ్.. ఈసారి మరింత యంగ్ అండ్ స్టైలిష్ అవతార్‌లో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా గ్లింప్స్‌కు మరింత ఎనర్జీని తీసుకొచ్చింది. స్టైలిష్ విజువల్స్, మాస్ ఎలిమెంట్స్, నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ కలగలిపి ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
అంతేకాకుండా ఈ సినిమాను డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నాగార్జున కెరీర్లో 100వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.









