Search
Close this search box.

  నాని ‘ది ప్యారడైజ్’ నుంచి సెకండ్ సాంగ్.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

August 27, 2026 9:44 PM | Aditya369 News

నాని ‘ది ప్యారడైజ్’ నుంచి సెకండ్ సాంగ్.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

నాచురల్ స్టార్ నాని హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది.

ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘ఆయా’కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. ఇప్పుడు రెండో సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా మేకర్స్ రెండో పాటకు సంబంధించి అధికారిక అప్‌డేట్ ఇచ్చారు. ఆగస్టు 28న జరిగే లైవ్ కచేరీలో అనిరుద్ స్వయంగా లైవ్ పెర్ఫార్మెన్స్ ద్వారా ఈ పాటను ముందుగా రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆగస్టు 29న ఈ సాంగ్‌ను ఆన్‌లైన్‌లో అధికారికంగా విడుదల చేయనున్నారు.

మొదటి పాట ‘ఆయా’కు లిరిక్స్ అందించిన కాసర్ల శ్యామ్‌నే ఈ రెండో పాటకు కూడా సాహిత్యం అందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈసారి పక్కా ఫోక్ టచ్‌తో ఉండేలా అనిరుద్ రవిచందర్ అదిరిపోయే ట్యూన్‌ను కంపోజ్ చేసినట్లు సమాచారం.

దీంతో ‘ఆయా’ తర్వాత రాబోతున్న ఈ రెండో పాట ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది? అనిరుద్ మ్యూజిక్‌తో నాని సినిమా హైప్‌ను మరింత పెంచుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఆగస్టు 29న విడుదల కాబోయే ఈ పాటకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు