బాలీవుడ్ నుంచి అత్యంత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘రామాయణ’. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఇక ఈ సినిమాకు మ్యూజిక్ విషయంలో కూడా ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ కలిసి ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ‘రామాయణ’ నుంచి ఫస్ట్ సాంగ్‌కు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను సెప్టెంబర్ 2026లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తాజా బజ్ వినిపిస్తోంది. అయితే పాట రిలీజ్‌కు సంబంధించిన ఖచ్చితమైన తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ‘రామాయణ’ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగాన్ని దీపావళి సందర్భంగా నవంబర్ 8, 2026న ఇండియాలో విడుదల చేయనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం నవంబర్ 6 నుంచే సినిమా అందుబాటులోకి రానుంది.
అయితే సెప్టెంబర్‌లో ఫస్ట్ సాంగ్ విడుదలైతే.. సినిమాకు ప్రమోషన్స్ మరింత జోరందుకునే అవకాశం ఉంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
మరి ‘రామాయణ’ ఫస్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుంది? పాటతో మేకర్స్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారు? అనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో మరింత పెరిగింది.









