టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా ఇప్పటికే భారీ అంచనాలు పెంచుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనిల్ రావిపూడి సక్సెస్ సీక్రెట్ ఇదేనా?
అనిల్ రావిపూడి ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలన్నీ వరుస విజయాలను అందుకున్నాయి. తన కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను మెప్పించడం ఆయన ప్రత్యేకత.
ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌లో అనిల్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈసారి కూడా మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.
ఇప్పుడు విక్టరీ వెంకటేశ్‌తో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్, కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మల్టీస్టారర్‌కు తాజాగా ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
టైటిల్ కింద ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే క్యాప్షన్ కూడా పెట్టడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. టైటిల్ ప్రకటించిన విధానం కూడా అనిల్ రావిపూడి మార్క్ కామెడీని గుర్తు చేస్తోంది.
అసలు టైటిల్‌ను ఎలా ప్రకటించారంటే?
టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ సినిమాకు సంబంధించిన ఓ ఫేమస్ కామెడీ సీన్‌తో మొదలుపెట్టారు.
ఆ తర్వాత వెంకటేశ్, కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి, అనిల్ రావిపూడి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారు. అక్కడ వెంకటేశ్.. సినిమా టైటిల్ ఏంటని అనిల్ రావిపూడిని అడుగుతారు.
దానికి అనిల్.. ‘జనవరి 12 విడుదల’ అని చెబుతారు.
వెంటనే వెంకటేశ్.. ‘నేను అడిగింది రిలీజ్ డేట్ కాదు’ అని అంటారు. కల్యాణ్ రామ్ కూడా ‘సార్ అడిగింది సినిమా టైటిల్’ అని క్లారిటీ ఇస్తారు.
అయినా అనిల్ రావిపూడి మాత్రం మరోసారి ‘జనవరి 12 విడుదల’ అని చెప్పడంతో.. చివరికి అదే సినిమా టైటిల్ అని రివీల్ చేశారు.
అంతేకాదు.. సినిమా విడుదల తేదీ కూడా జనవరి 12 కావడంతో టైటిల్, రిలీజ్ డేట్ రెండూ ఒకటే కావడం మరింత ఆసక్తిని పెంచుతోంది.
స్టార్ హీరోయిన్లుగా కీర్తి, కృతి!
ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరపాటి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీ.వీ. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
మొత్తానికి వెంకటేశ్, కల్యాణ్ రామ్ కాంబినేషన్‌కు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ తోడవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ‘జనవరి 12 విడుదల’ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి.








