ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత క్రేజీ లైనప్ కలిగిన హీరోల్లో ఒకరిగా నిలిచిన బన్నీ, పలువురు స్టార్ దర్శకులతో భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. వీటిలో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో తెరకెక్కనున్న ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
కేవలం అనౌన్స్మెంట్తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్గా స్టార్ బ్యూటీ పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే, ‘అల వైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్–పూజా హెగ్డే హిట్ జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది.
అంతేకాదు, ఇటీవల లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘కూలీ’ సినిమాలో కూడా పూజా హెగ్డే తన ప్రత్యేక పాత్రతో ఆకట్టుకుంది. దీంతో లోకేష్, బన్నీ, పూజా హెగ్డే కాంబినేషన్లో సినిమా వస్తే అది మరింత క్రేజీ ప్రాజెక్ట్‌గా మారే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు.
అయితే, పూజా హెగ్డే ఎంపికపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ వార్తపై క్లారిటీ రావాలంటే అధికారిక అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.









