న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా షూటింగ్ కొంత ఆలస్యమవుతున్న నేపథ్యంలో, నాని తన తదుపరి ప్రాజెక్ట్‌లను వరుసగా లాక్ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే దర్శకుడు సుజీత్‌తో ‘బ్లడీ రోమియో’ అనే ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని.. ఇప్పుడు మరో యువ దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన కథ నానికి బాగా నచ్చిందట. ఇటీవల జరిగిన ఫైనల్ నరేషన్ తర్వాత ఈ ప్రాజెక్ట్‌కు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రేజీ కాంబినేషన్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
ప్రస్తుతం వెంకీ అట్లూరి హీరో సూర్యతో ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాను తెరకెక్కిస్తుండగా, దర్శకుడు సుజీత్ ‘ఓజీ 2’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తైన తర్వాత నాని-వెంకీ అట్లూరి సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరి ఈ కొత్త కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో, నాని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









