హైదరాబాద్కు చెందిన ఒక కుమారుడు తన తల్లి చిరకాల కోరికను నెరవేర్చి ఆమె ముఖంలో వెలకట్టలేని చిరునవ్వును నింపాడు.ప్రతి తల్లి తన జీవితాంతం పిల్లల ఎదుగుదల కోసమే పరితపిస్తుంది, కానీ తన చిన్న చిన్న కోరికలను మాత్రం ఎప్పుడూ బయటపెట్టదు.ఆ తల్లికి విమాన ప్రయాణం చేయాలనేది చిరకాల కోరిక.ఆది అర్థం చేసుకున్న కొడుకు,తల్లిని హైదరాబాద్ నుండి ఢిల్లీకి విమానంలో తీసుకువెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు.
మొదటిసారి ఆకాశంలో విహరిస్తున్నప్పుడు ఆమె కళ్ళలో కనిపించిన ఆనందం, ఆశ్చర్యం మాటలకు అతీతం.మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, మనల్ని ఈ స్థాయికి చేర్చిన తల్లిదండ్రుల కలలను గౌరవించడం మన బాధ్యత.డబ్బుతో మనం ఎన్నో వస్తువులను కొనవచ్చు, కానీ తల్లిదండ్రుల కళ్ళలో చూసే ఇటువంటి ‘మరుపురాని ఆనందాన్ని కొనలేము.మన కోసం
తల్లితండ్రులు చేసిన త్యాగాలకు మనం ఇవ్వగలిగేది ఏదన్నా ఉందంటే వృద్ధాప్యంలో వారికి అండగా నిలబడడం వాళ్ళ చిన్న చిన్న కోరికలను మనం తీర్చడమే.








