కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం చిట్టోడితోటలో నివాసముంటున్న లంకవలస దుర్గాభవానీ అనే మహిళ పిఠాపురం రైల్వేస్టేషన్ వద్ద రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సోమవారం సామర్లకోట నుండి విశాఖవైపు వెళుతున్న గూడ్సు రైలు ఢీకొట్టడంతో ఆమె మృతిచెందినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు. దుర్గాభవానీ ఇళ్లల్లో పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ జీవిస్తోంది. చాలా కాలం నుండి ఈమె భర్త దూరంగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఈనేపథ్యంలో ఏం జరిగిందో ఏమో..రైలు పట్టాలపై ఆమె విగతజీవిగా మారింది. సామర్లకోట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







