కాకినాడ జిల్లా పిఠాపురం పుణ్యక్షేత్రం పాదగయలో శివరాత్రి మహోత్సవాలు ఆఖరి రోజు బుధవారం రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వరస్వామి తెప్పోత్సవం నిర్వహించారు.స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో విశేషపూజాధి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పాదగయ పుష్కరిణిలో హంసవాహనంపై తెప్పోత్సవము నిర్వహించారు. వచ్చిన భక్తులకు స్వామిఅమ్మవార్ల ఆశీర్వచనాలు అందించారు. అనంతరం పుష్పోత్సవ కార్యక్రమాన్ని చేశారు. పిఠాపురం జనసేన నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పిఠాపురం సిఐ జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శ్రీ పుష్పోత్సవం అనంతరం భక్తులకు తాంబూల ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంతో పిఠాపురంలో శివరాత్రి మహోత్సవాలు ముగిశాయి.










