కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో రెండు వర్గాలకు చెందిన యువకుల మధ్య ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. పిఠాపురం అయితే నగర్ ప్రాంతానికి చెందిన మంగం నాగసురేష్ ,సీకోటి ఆకాష్ లతోపాటు, జీవన్ నగర్ ప్రాంతానికి చెందిన ఏడిద వెంకటరమణ , కోడి సుబ్రహ్మణ్యం, రాజేష్ లు గాయపడ్డారు .పిఠాపురంలో వీరికి ప్రథమ చికిత్స అందించి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు .పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తు న్నారు. పాత కక్షల నేపథ్యంలో వీరు ఘర్షణ పడినట్లుగా తెలుస్తోంది.









